కోర్టు వ్యాఖ్యలకు ఏం చేయాలో తెలియక సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్‌కే పరిమితమయ్యారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఎద్దేవా చేశారు. ఖమ్మం ఆర్టీసీ డిపో వద్ద కార్మికులు చేసిన ధర్నాకు మద్దతు తెలిపారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులను భయపెట్టిన కేసీఆర్... ఈ రోజు వస్తున్న మద్దతు చూసి భయపడుతున్నాడన్నారు. నియంతృత్వ పోకడలు మానుకొని ప్రజాస్వామ్యయుతంగా సమస్యలను పరిష్కరించాలని అని సూచించారు.
'కేసీఆర్ నియంతృత్వ పోకడలను మానుకోవాలి' - tsrtc strike today
ఖమ్మంలో ఆర్టీసీ కార్మికుల ధర్నాకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మద్దతు తెలిపారు. వెంటనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు.

'కేసీఆర్ నియంతృత్వ పోకడలను మానుకోవాలి'
'కేసీఆర్ నియంతృత్వ పోకడలను మానుకోవాలి'