ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం కొక్కిరేణిలో ఓ వ్యక్తి సెల్ టవర్ ఎక్కాడు. తన భార్య కాపురానికి రావడం లేదంటూ పురుగుల మందు డబ్బాతో హల్చల్ చేశాడు. గ్రామస్థులు నచ్చజెప్పేందుకు యత్నించి విఫలయత్నం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితున్ని కిందకు దించి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
పురుగుల మందు సీసాతో సెల్‌టవర్ ఎక్కిన వ్యక్తి - ఖమ్మం నేరవార్తలు
భార్య కాపురానికి రావడం లేదనే కోపంతో ఖమ్మంలో ఓ వ్యక్తి సెల్‌టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. గ్రామస్థుల సాయంతో అతన్ని కిందకు దించిన పోలీసులు స్టేషన్‌కు తరలించారు.
Breaking News
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగేనపల్లి మండలం నేరాళ్లకు చెందిన రాజు ఖమ్మంలో హోటల్ నిర్వహిస్తున్నాడు. ఖమ్మం జిల్లా కొక్కరేణికి చెందిన ఉమతో వివాహం జరిగింది. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడం వల్ల ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది.