అసెంబ్లీలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడారు. రాష్ట్రంలో రోడ్లు, కల్వర్టుల పరిస్థితిపై వివరించారు. దీనికి తన నియోజకవర్గంలోని ఓ ఘటనను వివరించారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో బనిగళ్లపాడు, తక్కెళ్లపాడు గ్రామాల మధ్య ఓ వాగు ప్రవహిస్తోందని తెలిపారు.
అసెంబ్లీలో భట్టి చెప్పిన నిజం.. అందరినీ ఆలోచింపజేసింది! - రహదారుల సమస్య
రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. తన నియోజకవర్గంలో నాలుగేళ్లక్రితం జరిగిన ఓ ఘటన గురించి అసెంబ్లీలో ప్రస్తావించారు.
'రోడ్లను మరమ్మతులు చేయండి'
వర్షాకాలం కావడం వల్ల వాగు ఉద్ధృతి పెరిగిందని, పన్నెండేళ్ల బాలుడు అందులో పడి చనిపోయాడని గుర్తు చేశారు. అప్పటి నుంచి అక్కడ కల్వర్టు నిర్మించాలని కోరినా, స్పందన లేదన్నారు. రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి మరెన్నో చోట్ల ఉందని, దీనిపై దృష్టి సారించాలని కోరారు. భట్టి చెప్పిన తీరు అసెంబ్లీలో అందరినీ ఆలోచింపజేసింది.
ఇదీ చూడండి:మహిళా అభిమానులూ నా భార్యతో జాగ్రత్త