ఖమ్మం శ్రీనివాస్ నగర్లోని శ్రీ ధర్మ శాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయంలో మకరజ్యోతి దర్శనం నిర్వహించారు. దేవస్థానంపై ఆలయ ప్రధాన అర్చకుడు నంబూద్రిపాద్ కర్పూరం వెలిగించి జ్యోతి దర్శనం చేయించారు.
శరణుఘోష..
భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి జ్యోతి దర్శనం చేసుకున్నారు. ఆలయ ప్రాంగణమంతా స్వామియే శరణమయ్యప్ప అనే శరణుఘోషతో మార్మోగింది.