పొట్టచేత పట్టుకుని మహారాష్ట్ర నాందేడ్ జిల్లా నుంచి ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలంలో మిరప పంట ఏరేందుకు వచ్చిన వలస కూలీలు లాక్‌డౌన్ అమలు కారణంగా పని కోల్పోయారు. చేతిలో ఉన్న డబ్బులు అయిపోయాయి. సొంత ప్రదేశం ఎంత దూరం ఉంటుందో కూడా తెలియదు. కానీ... గ్రామం చేరాలన్న కాంక్ష బలంగా ఉంది.
దూరం తెలియని ప్రయాణం... ఇళ్లు చేరటమే లక్ష్యం! - CORONA UPDATES
లాక్‌డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన వలస కూలీలు... ఎలాగైనా స్వస్థలాలు చేరుకునేందుకు కష్టపడుతున్నారు. కాలినడకన వందల కిలోమీటర్లు నడిచేందుకుృ రోడ్డు వెంట వెళితే పోలీసులు అడ్డుపడుతున్నారన్న భయంతో... పిల్ల బాటలు పట్టారు పలువురు వలస కార్మికులు.
దూరం తెలియని ప్రయాణం... ఇళ్లు చేరటమే లక్ష్యం!
రోడ్డుపై వెళ్తే పోలీసులు ఆపుతారనే ఉద్దేశంతో మొత్తం 120మంది చిన్నాపెద్దలు కాల్వకట్టపై నడుస్తూ బయలుదేరారు. కట్ట వెంట నడుచుకుంటూ ఆదివారం రోజు ఖమ్మం చేరుకున్నారు. వలస కూలీల ప్రయాణ సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు వారిని అడ్డగించారు. బాగా అలిసిపోయిన వారికి నీళ్లు, బిస్కెట్లు, ఆహారం అందించారు. లాక్‌డౌన్ ముగిసేవరకు వెళ్లేందుకు అనుమతులు లేవంటూ నగర శివారులోని ఓ ఫంక్షన్ హాల్లో ఆశ్రయం కల్పించారు.