వైభవంగా శ్రీ వాసవి కన్యాకా పరమేశ్వరి జన్మదిన వేడుకలు
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారి జన్మదిన వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నారు. పసుపు కుంకుమలతో అమ్మవారికి ప్రత్యేకాభిషేకాలు చేశారు.
కన్యాకా పరమేశ్వరి జన్మదిన వేడుకలు
ఖమ్మం జిల్లా మధిరలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. వేద పండితులు శ్రీనివాసులు, శేషాచార్యులు అంకురం శాస్త్రీ వేద మంత్రోచ్ఛారణలతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. మహిళలు అమ్మవారిని కీర్తిస్తూ ప్రత్యేక భజనలు చేశారు. బ్రాహ్మణ పరిషత్ అధ్యక్షుడు వెంకటేశ్వర శర్మ ఆధ్వర్యంలో హోమ పూజలు జరిపారు.