ఖమ్మం జిల్లా మధిరలోని వెంకటేశ్వర స్వామి దేవాలయం దశమ బ్రహ్మోత్సవ వేడుకల ఆహ్వాన పత్రికలను ఆలయ ప్రాంగణంలో ఆవిష్కరించారు. ముందుగా ఆలయ ప్రధాన అర్చకులు వేద మంత్రోచ్ఛరణలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మే 13 నుంచి 17వ వరకు ఈ ఉత్సవాలు నిర్వహించనున్నారు. 13న లక్ష్మీ, పద్మావతి అమ్మవార్లను పెళ్లికుమార్తెలుగా.. శ్రీ వెంకటేశ్వర స్వామిని పెళ్లికుమారుడుగా అలంకరించనున్నారు. 14న వరపూజ, ఎదుర్కోళ్లు ఉత్సవం.. 15న స్వామివారి తిరు కల్యాణం.. 16న యజ్ఞ నారాయణ మూర్తికి గరుడోత్సవం నిర్వహించనున్నారు. 17న మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు జరుపనున్నారు.
దశమ బ్రహ్మోతవ వేడుకల ఆహ్వాన పత్రికల ఆవిష్కరణ - పద్మావతి
మధిరలోని వెంకటేశ్వర స్వామి ఆలయ దశమ బ్రహ్మోత్సవ వేడుకల ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించారు. ఈ ఉత్సవాలు మే 13 నుంచి 17 వరకు జరగనున్నాయి.
దశమ బ్రహ్మోతవ వేడుకల ఆహ్వాన పత్రికల ఆవిష్కరణ