తెలంగాణ

telangana

ETV Bharat / state

మధిరకు మాతాజీ నిర్మలా దేవి రథయాత్ర - మాతాజీ నిర్మలా దేవి సహజ యోగ చైతన్య రథయాత్ర

గుజరాత్​లో ప్రారంభమైన మాతాజీ నిర్మలా దేవి సహజ యోగ చైతన్య రథయాత్ర ఖమ్మం జిల్లా మధిరకు చేరింది. మాతాజీ నిర్మలా దేవి ఆవిర్భవించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ రథయాత్ర చేపట్టారు.

మధిరకు మాతాజీ నిర్మలా దేవి రథయాత్ర

By

Published : Aug 23, 2019, 5:17 PM IST

మధిరకు మాతాజీ నిర్మలా దేవి రథయాత్ర
మాతాజీ నిర్మలా దేవి సహజ యోగ ఆవిర్భవించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా చేపట్టిన చైతన్య రథ యాత్ర ఖమ్మం జిల్లా మధిరకు చేరుకుంది. గుజరాత్ రాష్ట్రంలో ప్రారంభమైన ఈ రథయాత్ర వరంగల్, ఖమ్మం మీదుగా మధిరకు చేరుకుంది. సహజ యోగ సాధకులు రథయాత్రకు మేళతాళాలతో ఘనస్వాగతం పలికారు. అనంతరం పురవీధుల్లో పాదయాత్ర నిర్వహించి సహజ యోగ ఆవశ్యకత, నిత్య సాధన వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. అనంతరం రథయాత్ర ఆంధ్రప్రదేశ్​లోకి ప్రవేశించింది.

ABOUT THE AUTHOR

...view details