ఖమ్మం జిల్లా తల్లాడలో శ్రీ హనుమత్ పద్మావతి సమేత వెంకటేశ్వరస్వామి ఆలయ 17వ వార్షికోత్సవ పూజలను వైభవంగా నిర్వహించారు. వార్షికోత్సవాల్లో భాగంగా ఉత్సవ మూర్తులను ఆలయం ఎదురు మండపంలో కొలువుదీర్చి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు.
తల్లాడలో ఘనంగా వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవాలు - తల్లాడలో వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షకోత్సవాలు
ఖమ్మం జిల్లా తల్లాడలో శ్రీ హనుమత్ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
![తల్లాడలో ఘనంగా వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవాలు lord venkateswara temple anniversary celebrations in khamma tallada](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6205442-246-6205442-1582686779316.jpg)
తల్లాడలో ఘనంగా వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవాలు
స్వామివారికి తులాభారం, హోమం వంటి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. భక్తుల భజనలతో ఆలయ ప్రాగణమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. హనుమంతుడు, శ్రీనివాసుడికి మొక్కులు తీర్చుకున్నారు.
తల్లాడలో ఘనంగా వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవాలు