తెలంగాణ

telangana

ETV Bharat / state

ఖమ్మంలో పటిష్ఠంగా లాక్​డౌన్ అమలు - తెలంగాణ వార్తలు

ఖమ్మంలో పోలీసులు లాక్​డౌన్​ను కఠినంగా అమలు చేస్తున్నారు. జూబ్లీక్లబ్‌ చెక్‌పోస్టు వద్ద రూరల్‌ ఏసీపీ వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. అనవసరంగా బయటకు వచ్చిన వారి వాహనాలను సీజ్ చేస్తూ, కేసులు నమోదు చేస్తున్నారు.

lock down strictly imposed in khammam , khammam lock down
ఖమ్మంలో పటిష్ఠంగా లాక్​డౌన్, ఖమ్మంలో కఠినంగా లాక్​డౌన్

By

Published : May 25, 2021, 2:54 PM IST

ఖమ్మంలో 14వ రోజు లాక్‌డౌన్‌ను పటిష్ఠంగా అమలు చేస్తున్నారు. నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహనదారులను నియంత్రిస్తున్నారు. జూబ్లీక్లబ్‌ చెక్‌పోస్టు వద్ద రూరల్‌ ఏసీపీ వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు.

వాహనదారులను ఆపి వివరాలు సేకరిస్తున్నారు. అనవసరంగా రోడ్డుపైకి వచ్చే వాహనాలను సీజ్‌ చేసి, కేసులు నమోదు చేస్తున్నారు. ప్రజలు లాక్‌డౌన్‌కు పూర్తిగా సహకరిస్తున్నారని పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:నిమిషంలోనే కరోనాను పసిగట్టే శ్వాస పరీక్ష!

ABOUT THE AUTHOR

...view details