ఖమ్మం జిల్లాలో ప్రజలు స్వచ్ఛందంగా లాక్‌డౌన్ పాటిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావడం లేదు. ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావటం వల్ల... రహదారులు నిర్మానుష్యంగా మారాయి. ఉపాధి కోల్పోయి ఇంటివద్దే ఉంటున్న పేదలను ఆదుకునేందుకు పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తున్నాయి. పేదలకు, వలస కార్మికులకు భోజనం, నిత్యావసరాలు అందజేస్తున్నారు. నగరంలోని పలు చెక్‌పోస్టుల వద్ద యువకులు వాలంటీర్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు.
ఖమ్మంలో ప్రశాంతంగా లాక్‌డౌన్ - Corona Lock Down Khammam
కరోనా వైరస్‌ను అరికట్టేందుకు ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్ ఖమ్మం జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతోంది. అనవసరంగా ప్రజలు రహదారులపైకి రాకుండా పోలీసులు గట్టి చర్యలు చేపట్టారు.
ఖమ్మంలో ప్రశాంతంగా లాక్‌డౌన్