నిత్యం వందల మందితో సందడి చేసే వ్యాయమశాలల్లో నిశ్శబ్ధం ఆవహించింది. ప్రస్తుత పరిస్థితుల్లో వాటిని ఎప్పుడు తెరుస్తారో తెలియదు... ఉపాధి కోల్పోవడంతో నిర్వహకులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం 37 జిమ్ములు ఉన్నాయి. ఒక్క ఖమ్మంలోనే 12 ఉన్నాయి. మారుతున్న జీవన శైలికి అనుగుణంగా... జిమ్‌లకు ఆదరణ పెరిగింది.
మూడు నెలలుగా మూతపడ్డ జిమ్‌లు
యువత ఎక్కువగా రావటం వల్ల ఇదే వృత్తి జీవనాధారంగా చాలా మంది ఔత్సాహికులు వ్యాయమశాలలు ఏర్పాటు చేసుకున్నారు. నూతన ఒరవడి తీసుకువస్తూ అత్యాధునిక పరికరాలు కోనుగోలు చేస్తే.. కరోనా రూపంలో పెను ప్రమాదం తీసుకొచ్చింది. మూడు నెలలుగా జిమ్‌లు మూత పడటంతో....అందులో పనిచేసే శిక్షకులకు, భవనం అద్దెలు చెల్లించడం కష్టంగా ఉందని వాపోతున్నారు.
ఖమ్మం నగరంలో జిమ్‌లు జీవనాధారంగా చేసుకుని వాటిపై ఆధారపడ్డవారు చాలామందే ఉన్నారు. ఆరోగ్య ప్రియులను ఆకర్షించేందుకు అధునాతన పరికరాలను కోనుగోలు జరిపారు. ప్రస్తుతం వాటిని ఉపయోగించకపోవడం వల్ల పరికరాలు తుప్పు పడుతున్నాయి.