తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్లాస్టిక్ రహిత ఖమ్మంగా తీర్చిదిద్దుదాం - Let's make it plastic-free City of Khammam

గాంధీ 150వ జయంతిని పురస్కరించుకొని ఖమ్మంలో ప్లాస్టిక్​ వాడవద్దంటూ ర్యాలీ నిర్వహించారు.

ప్లాస్టిక్ రహిత ఖమ్మంగా తీర్చిదిద్దుదాం

By

Published : Oct 2, 2019, 11:42 AM IST

గాంధీ జయంతి పురస్కరించుకుని ఖమ్మంలో ప్లాస్టిక్‌పై యుద్ధం ప్రకటించారు. ప్లాస్టిక్‌ వాడొద్దంటూ ర్యాలీ నిర్వహించారు. నెహ్రూ యువకేంద్రం, యువజన శాఖ ఆధ్వర్యంలో ఖమ్మం నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి గాంధీ చౌక్‌లోని గాంధీ విగ్రహం వరకు ర్యాలీ తీశారు. ర్యాలీలో యువకులు, విద్యార్థులు, ఎన్‌సీసీ క్యాడెట్లు, నగరపాలక సిబ్బంది పాల్గొన్నారు. ప్లాస్టిక్‌ ఫ్రీ ఖమ్మంగా నగరాన్ని తీర్చిదిద్దాలని మేయర్‌ వెల్లడించారు. ఖమ్మంలో ఈరోజు నుంచి ప్లాస్టిక్‌ కవర్లు నిషేధిస్తున్నట్లు ట్రైనీ కలెక్టర్ పేర్కొన్నారు.

ప్లాస్టిక్ రహిత ఖమ్మంగా తీర్చిదిద్దుదాం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details