'పర్యావరణ పరిక్షణకు పాటుపడుదాం' - 'పర్యావరణ పరిక్షణకు పాటుపడుదాం'
వైరా నియోజకవర్గంలో మెగా హరితహారం ఘనంగా నిర్వహించారు. లక్ష మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
'పర్యావరణ పరిక్షణకు పాటుపడుదాం'
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలోని కొనిజర్ల, ఏనుకూరు, కారేపల్లి మండలాల్లో లక్ష మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే రాములు నాయక్ ప్రారంభించారు. నాలుగు మండలాల్లో ఉత్సాహంగా సాగిన హరితహారం పండుగను తలపించింది. అందరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తోడుగా ఉండాలని రాములు వ్యాఖ్యానించారు. గ్రామాల్లో ప్రజా ప్రతినిధులు, అధికారులు మొక్కలు నాటే కార్యక్రమాల్లో పాల్గొన్నారు.