రైల్వేలను ప్రైవేటీకరించాలనే ఆలోచనను కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని సీపీఎం, గిరిజన సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. రైల్వేలను కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పేందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను వ్యతిరేకిస్తూ, రైల్వేల ప్రైవేటీకరణను నిరసిస్తూ ఖమ్మం జిల్లా కారేపల్లిలోని రైల్వే స్టేషన్ ఎదుట సీపీఎం, గిరిజన సంఘాల నాయకులు ధర్నా చేశారు.
రైల్వే ప్రైవేటీకరణపై వామపక్ష కార్మిక సంఘాల నిరసన - ఖమ్మం జిల్లా వార్తలు
రైల్వేలను ప్రైవేటీకరించాలనే కేంద్ర ప్రభుత్వ ఆలోచనను వ్యతిరేకిస్తూ ఖమ్మం జిల్లా కారేపల్లిలోని రైల్వే స్టేషన్ ఎదుట సీపీఎం, గిరిజన సంఘాల నాయకులు ధర్నా చేశారు. రైల్వేలలో ప్రైవేటీకరణ ప్రయత్నాలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు.
రైల్వే ప్రైవేటీకరణ అంశంపై వామపక్ష కార్మిక సంఘాల నిరసన
రైల్వే శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని... రైల్వేలలో ప్రైవేటీకరణ ప్రయత్నాలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు వీరభద్రం, నాగేశ్వరరావు, నరేంద్రతో పాటు గిరిజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: కరోనా కట్టడికి.. ఆ పట్టణంలో 10 రోజుల స్వచ్ఛంద లాక్డౌన్..