తెలంగాణ

telangana

ETV Bharat / state

పెట్రో ధరలు తగ్గించాలని కలెక్టరేట్ వద్ద వామపక్షాల ధర్నా

పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ వామ పక్షాలు ఖమ్మం కలెక్టరేట్​ వద్ద ధర్నాకు దిగారు. కష్టాల్లో ఉన్న పేదలకు నెలకు రూ. 7,500లు జమ చేయాలన్నారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసనకు దిగారు.

left parties protests over petrol price hike at khamma collector office
పెట్రో ధరలు తగ్గించాలని కలెక్టరేట్ వద్ద వామపక్షాల ధర్నా

By

Published : Jun 25, 2020, 1:05 PM IST

సీపీఐ, సీపీఎమ్, సీపీఐఎమ్​ల్ పార్టీ కార్యకర్తలు ఖమ్మం కలెక్టరేట్ వద్ద ధర్నాకు దిగారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. దేశ చరిత్రలో మున్నపెన్నడూ లేని విధంగా రోజూ పెట్రోల్ ధరలు పెంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుంకాలను, పన్నులను తగ్గించాలన్నారు. కరోనా సమయంలో నిరుపేద కుటుంబాలకు రూ. 7500లు ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీ సైతం పెంచిన ధరలపై పోరాటం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details