దిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనలకు మద్దతుగా ఖమ్మంలో న్యాయవాదులు దీక్షచేపట్టారు. ఖమ్మం జిల్లా కోర్టు ఎదుట ఏర్పాటు చేసిన శిబిరంలో... న్యాయవాదులు దీక్షలో పాల్గొని రైతులకు తమ సంఘీభావం తెలిపారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
రైతుల ఆందోళనలకు మద్దతు తెలిపిన న్యాయవాదులు - న్యాయవాదుల నిరసన
కేంద్ర ప్రవేశ పెట్టిన వ్యవసాయ బిల్లులను వెంటనే రద్దు చేయాలని... దిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనలకు మద్దతుగా ఖమ్మంలో న్యాయవాదులు దీక్ష చేపట్టారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
రైతుల ఆందోళనలకు మద్దతు తెలిపిన న్యాయవాదులు
కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు సానుకూలంగా లేని చట్టాలు... ప్రజా వ్యతిరేక చట్టాలని న్యాయవాదులు అభివర్ణించారు. వీటివల్ల చిన్న రైతులే కాదు... పెద్ద రైతులు సైతం దెబ్బతింటారని... చివరికి కార్పోరేట్ వ్యవసాయం మాత్రమే మిగులుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి:'రైతులతో చర్చలకు ఎల్లప్పుడూ సిద్ధం'