ఖమ్మంలో భారీగా కొలువుదీరిన గణనాథులు - ganesh
ఖమ్మంలో వాడవాడలా బొజ్జ గణపయ్య పూజలు అందుకుంటున్నాడు. ఉదయం నుంచే భక్తులు నవరాత్రి వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేశారు.
ఖమ్మం జిల్లా కేంద్రంలో భారీగా గణనాథులు కొలువుదీరారు. నగరంలోని వాడవాడలా వినాయక మండపాలు వెలిశాయి. భక్తులు ఈరోజు గణపతులను మండపాల్లో ప్రతిష్ఠించి పూజలు చేశారు. వివిధ రూపాల్లోని లంబోదరుడు మండపాల్లో కొలువుదీరి భక్తుల పూజలు అందుకుంటున్నాడు. నవరాత్రి వేడుకలకు ఉత్సవ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. పూజల అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందచేశారు. ప్రత్యేకంగా తయారు చేసిన లడ్డూలను తీసుకొచ్చి గణపతి మండపంలో ఉంచి పూజలు చేశారు. నగరంలోని చైతన్యనగర్, ఇందిరానగర్, రోటరీనగర్, శ్రీరాంనగర్ తదితర ప్రాంతాల్లో బొజ్జ గణపయ్యలు పూజలు అందుకున్నారు.
- ఇదీ చూడండి :విఘ్నేశ్వరుడికి కేంద్ర మంత్రుల పూజలు