ఆధార్ కార్డును మార్ఫింగ్ చేసి తప్పుడు పత్రాలతో దొంగ రిజిస్ట్రేషన్లు చేస్తున్న ముఠాపై చర్యలు తీసుకోవాలని లక్ష్మీ ప్రియ వెంచర్ బాధితులు డిమాండ్ చేశారు. ఖమ్మం నగరానికి సమీపంలోని రఘునాథపాలెం మండల కేంద్రంలో 1995లో వేసిన వెంచర్లు, ఫ్లాట్లను కొంతమంది ముఠాగా ఏర్పడి తప్పుడు పత్రాలతో వాటిని అమ్ముతూ బాధితులను మోసం చేస్తున్నారని వారు ఆరోపించారు.
'దొంగ రిజిస్ట్రేషన్లు చేస్తున్న ముఠాపై చర్యలు తీసుకోవాలి' - khammam district news
తప్పుడు పత్రాలతో దొంగ రిజిస్ట్రేషన్లు చేస్తున్న ముఠాపై చర్యలు తీసుకోవాలని ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండల కేంద్రంలో లక్ష్మీ ప్రియ వెంచర్ బాధితులు డిమాండ్ చేశారు. వెంచర్లో జరుగుతున్న అక్రమాలపై చర్యలు తీసుకొని దొంగ రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని అధికారులను కోరారు.
'దొంగ రిజిస్ట్రేషన్లు చేస్తున్న ముఠాపై చర్యలు తీసుకోవాలి'
లక్ష్మీ ప్రియ వెంచర్లో జరుగుతున్న అక్రమాలపై అధికారులు చర్యలు తీసుకొని దొంగ రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని వెంచర్ అసోసియేషన్ సభ్యులు అధికారులను కోరారు.
ఇవీ చూడండి: నిన్న లేఖ రాశారు... నేడు రెండు వాహనాలు కాల్చేశారు!