ఖమ్మం జిల్లా మధిరలోని పురాతన శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో లక్ష తులసి దళార్చన పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసులు, జనార్దన్ ఆచార్యులు, శేషా చార్యుల వేద మంత్రోచ్ఛారణలతో శాస్త్రోక్తంగా సీతారామచంద్రులకు తులసితో పూజలు జరిపారు. మహిళా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారికి తులసి దళాలతో అభిషేకాలు నిర్వహించారు. పూజల అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు.
రామాలయంలో లక్షతులసి దళార్చన - madhira
మధిరలోని పురాతన శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ఆషాడమాసం తొలి ఏకాదశి సందర్భంగా లక్ష తులసి దళార్చన పూజలు నిర్వహించారు.
రామాలయంలో లక్షతులసి దళార్చన