KTR About NTR in Khammam Tour : తారక రామారావు(NTR) పేరులోనే ఏదో తెలియని పవర్ ఉందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ అన్నారు. ఖమ్మం పర్యటనలో భాగంగా.. లకారం ట్యాంక్‌బండ్‌పై ఎన్టీఆర్ పార్కు(NTR Park Open)ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. లకారం సమీపంలో ఎన్టీఆర్ విగ్రహన్ని ఆయన ఆవిష్కరించారు. తనకు తారక రామారావు అనే పేరు ఉండటం చాలా ఆనందంగా ఉందని మంత్రి అన్నారు.
KTR Unveils NTR Statue in Khammam : చరిత్రలో మహనీయుల స్థానం ఎప్పటికీ చిరస్మరణీయంగా ఉంటుందని కేటీఆర్ పునరుద్ఘాటించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి ఎన్టీఆర్ ఆరాధ్య దైవమని అన్నారు. ఎన్టీఆర్ శిష్యుడిగా కేసీఆర్.. తెలంగాణ అస్తిత్వాన్ని దేశవ్యాప్తంగా చాటి చెప్పారని చెప్పారు. కేసీఆర్ హ్యాట్రిక్ సీఎంఅయితే రామారావు ఆత్మ కూడా శాంతిస్తుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
Minister KTR Khammam Tour :ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తున్నారు. ఆయనతో వెంట సహచర మంత్రులు పువ్వాడ అజయ్‌కుమార్, ప్రశాంత్‌రెడ్డిలు ఉన్నారు. ఈ క్రమంలో కొణిజర్ల మండలం గుబ్బగుర్తిలో ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారు. రూ.250 కోట్లతో గోద్రెజ్ సంస్థ సహకారంతో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ నిర్మిస్తున్నారు. లకారం ట్యాంక్‌బండ్‌పై ఎన్టీఆర్ పార్కును కేటీఆర్ ప్రారంభించారు.
అనంతరం అమృత్-2లో భాగంగా రూ.260 కోట్ల రూపాయలతో లకారం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. 20వ డివిజన్లో పుట్‌బాల్ టర్ఫ్ కోర్టును లాంఛనంగా ప్రారంభించారు. మొత్తం రూ.1,618 కోట్ల విలువైన పనులకు కేటీఆర్ ఇవాళ శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. ఆ తర్వాత ఖమ్మం, సత్తుపల్లిలో జరిగే బహిరంగ సభల్లో పాల్గొననున్నారు.