కౌలురైతు ఆత్మహత్య - koulu-raithu-suicide-
అప్పుచేసి పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేస్తున్న కౌలు రైతుల పరిస్థితి ఆత్మహత్యకు దారితీసింది. ఈ ఘటనతో ఖమ్మం జిల్లా హర్యా తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి
అప్పుల బాధ తాళలేక ఓ కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం హర్యా తండాలో విషాదం చోటుచేసుకుంది. బానోతు బాబు(40) తనకు ఉన్న ఎకరం భూమికి తోడుగా మరో ఎకరంన్నర భూమిని కౌలుకు తీసుకుని పత్తి, మిర్చి సాగు చేశాడు. అప్పు చేసి మరి పెట్టుబడి పెట్టాడు. పత్తి సరైన దిగుబడి రాకపోగా.. మిర్చి పంట గుబ్బతెగులు సోకి పూర్తిగా పాడైంది.
దీనితో చేసిన అప్పులు తీర్చలేక సోమవారం తన పొలంలోనే పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. గుర్తించిన స్థానికులు ఖమ్మం అస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మధ్యాహ్నం మృతి చేందినట్లు వైద్యులు తెలిపారు.