ఘనంగా రెండోరోజు కోటమైసమ్మ జాతర - kota maisamma jathara second day
ఖమ్మం జిల్లా ముసిరికాయలపల్లిలో జరుగుతున్న కోట మైసమ్మ జాతరలో రెండో రోజు అమ్మవారిని దర్శించుకునేందుకు వివిధ జిల్లాల నుంచి భక్తులు పోటెత్తారు.
ఘనంగా రెండోరోజు కోటమైసమ్మ జాతర
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం ముసిరికాయలపల్లిలో కోట మైసమ్మ జాతర రెండో రోజు ఘనంగా కొనసాగుతోంది. ముసిరికాయలపల్లి... వివిధ జిల్లాల నుంచి వచ్చిన భక్తులతో పోటెత్తింది. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వినోద ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మూడు రోజుల పాటు జరగనున్న ఈ జాతరకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు.