ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మార్కెట్లో 15రోజుల కిందట ఐకేపీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. పలువురు రైతులు తమ పంటను తీసుకొచ్చారు.
నత్తనడకన ధాన్యం కొనుగోళ్లు
ఆర్భాటంగా ఏర్పాటు చేశారు కానీ నత్తనడకన కొనుగోళ్లు జరుగుతున్నాయి. 15 రోజుల్లో ఇక్కడ కేవలం ఎనిమిది మంది రైతుల నుంచి 4419 బస్తాల ధాన్యమే కొనుగోలు చేశారు. అంతకుముందు కొన్న 3,086 బస్తాల ధాన్యం కూడా మిల్లులకు రవాణా చేయలేదు.
నిర్లక్ష్యంపై రోడ్డెక్కిన రైతులు
మార్కెట్కు తీసుకొచ్చి వారం అవుతున్నా.. కొనుగోళ్లు జరగలేదు. ఓపిక నశించిన రైతులు ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని రోడ్డెక్కారు. స్థానిక పొట్టి శ్రీరాములు సెంటర్ వద్ద రాస్తారోకో చేశారు. విషయం తెలుసుకున్న సి.ఎస్.డి.టి. విజయ్ బాబు, పోలీసులు అక్కడకు చేరుకొని సాధ్యమైనంత త్వరగా ధాన్యం కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. అన్నదాతలు శాంతించారు.