ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పరిధిలో ఉన్న వైరా నియోజకవర్గంలో ఏన్కూరు, జూలూరుపాడు, కారేపల్లి మండలాల్లో ఎన్నికలు బహిష్కరించారు. గిరిజనులు సాగు చేసుకునే పోడుభూములపై ఆంక్షలు విధించడం, తమకు రైతుబంధు, రైతుబీమా పథకాలు అందడం లేదని.. ఇతరత్రా సమస్యలను తీర్చలేదంటూ ఈ నిర్ణయం తీసుకున్నారు.
సమస్యల తాండవం...
ఆయా మండలాల్లోని గ్రామాల్లో సమస్యలు తాండవం చేస్తున్నాయి. తాగు, సాగునీటికి అవస్థలు తప్పడం లేదు. మిషన్ భగీరథ పనులు చాలా చోట్ల గుంతలకే పరిమితమయ్యాయి. తమ సమస్యలు పరిష్కరిస్తామని ఎన్నికల ముందు చెప్పే నేతలు గెలిచిన తర్వాత ముఖం చాటేస్తున్నారని ఆవేదన వెలిబుచ్చారు. కొంతమంది సెల్టవర్లు ఎక్కి నిరసన చేపట్టారు. సాధారణ రోజుల్లో రహదారులు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద నిరసన తెలిపిన ప్రజలు ఎన్నికల రోజున ఆ సమస్యలపై స్పష్టమైన హామీ ఇవ్వాలని ఓటింగ్ బహిష్కరించారు.