తెలంగాణలో తెరాస ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు మార్చుకునే వరకూ భాజపా నిరంతర పోరాటాలు చేస్తుందని ఆ పార్టీ అనుబంధ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి వెల్లడించారు. ఖమ్మం జిల్లా మధిరలో భాజపా ఆధ్వర్యంలో ఎల్ఆర్ఎస్ను రద్దు చేయాలని తహసీల్దార్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు.
'ప్రభుత్వ తీరు మారేవరకూ పోరాటం సాగిస్తాం' - మధిరలో కిసాన్ మోర్చా నాయకుల ధర్నా
తెరాస ప్రభుత్వం తీరు మారేవరకు భాజపా పోరాటం కొనసాగిస్తుందని కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి తెలిపారు. మధిరలో ఎల్ఆర్ఎస్ను రద్దు చేయాలని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.
'ప్రభుత్వ తీరు మారేవరకూ పోరాటం సాగిస్తాం'
కేంద్ర ప్రభుత్వం ప్రజలను ఆదుకునేందుకు సంక్షేమ పథకాలు తీసుకొస్తుంటే రాష్ట్రంలో మాత్రం తెరాస సర్కార్ ప్రజలను దోచుకునేందుకు ఎల్ఆర్ఎస్ జీవో తెచ్చిందని శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు. అనంతరం తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు చిలువేరు సాంబశివరావు, పట్టణ మండల అధ్యక్షుడు పాపట్ల రమేష్, గుండా శేఖర్ రెడ్డి పాల్గొన్నారు.
ఇదీ చదవండి:ఎల్‌ఆర్‌ఎస్ జీవో సవరించి రేపు విడుదల చేస్తాం : కేటీఆర్