తెలంగాణ

telangana

ETV Bharat / state

పట్టణాల ప్రగతే ప్రభుత్వ ధ్యేయం: లింగాల కమల్​రాజ్ - khammam zp chairmen lingala kamal raju

మధిరలో రైల్వే అండర్ బ్రిడ్జి సమస్య దశాబ్దాలుగా వేధిస్తోందని ఖమ్మం జిల్లా పరిషత్ ఛైర్మన్ లింగాల కమల్ రాజు తెలిపారు. ఎంపీ నామా నాగేశ్వరరావు రైల్వే శాఖ దృష్టికి తీసుకెళ్లడంతో సానుకూలంగా స్పందించారని, త్వరలోనే దీనికి మోక్షం కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

khammam zp chairmenkhammam zp chairmen
'పట్టణాల ప్రగతే ధ్యేయంగా ముందుకెళ్తున్నాం...'

By

Published : Jun 16, 2020, 6:28 PM IST

పట్టణాల ప్రగతే ధ్యేయంగా తెరాస ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్లు జిల్లా పరిషత్ ఛైర్మన్ లింగాల కమల్ రాజు పేర్కొన్నారు. మధిరలో ఛైర్ పర్సన్ లతతో కలిసి కమల్​రాజ్ మాట్లాడారు.

ఎన్నికల సమయంలో తెరాస ఇచ్చిన హామీల మేరకు ప్రజలకు అన్ని రకాల మౌళిక వసతులను కల్పించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు కమల్​రాజ్ వివరించారు.

తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంగా ఉన్న మధిరలో దశాబ్ద కాలంగా ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జి సమస్యను ఎంపీ నామా నాగేశ్వరరావు రైల్వే శాఖ దృష్టికి తీసుకెళ్లడంతో సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. సమావేశంలో తెరాస మండల అధ్యక్షులు రావూరి శ్రీనివాసరావు, ఆత్మ కమిటీ ఛైర్మన్ రంగిశెట్టి కోటేశ్వరరావు, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు దేవిశెట్టి రంగా రావు, అరిగే శ్రీనివాస రావు పాల్గొన్నారు.

ఇవీ చూడండి:రాష్ట్రంలో ఐదు వేలకు చేరువలో కరోనా కేసులు

ABOUT THE AUTHOR

...view details