సబ్బండ వర్గాల సంక్షేమమే తెరాస ప్రభుత్వ లక్ష్యమని ఖమ్మం జడ్పీ ఛైర్మన్ లింగాల కమల్ రాజు అన్నారు. మధిర పురపాలక పరిధిలోని అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని వివరించారు.
'సబ్బండ వర్గాల సంక్షేమమే తెరాస ప్రభుత్వ లక్ష్యం' - khammam district latest news
సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెరాస ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు సాగుతున్నట్లు ఖమ్మం జడ్పీ ఛైర్మన్ లింగాల కమల్ రాజు పేర్కొన్నారు. మధిర పురపాలక పరిధిలోని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

khammam zp chairmen
రహదారి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం పార్టీ కార్యాలయంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు పల్లపోతు ప్రసాదరావుకు కండువా కప్పి తెరాసలోకి ఆహ్వానించారు.
ఇదీ చదవండి :సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ ఆదర్శం: తలసాని