కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను తక్షణమే రద్దు చేయాలని జిల్లా పరిషత్ ఛైర్మన్ లింగాల కమల్ రాజు డిమాండ్ చేశారు. భారత్ బంద్‌లో భాగంగా ఖమ్మం జిల్లా మధిరలో తెరాస ఆధ్వర్యంలో చేపట్టిన బైక్ ర్యాలీని ఆయన ప్రారంభించారు. రైతు సంక్షేమానికి ప్రాధాన్యమిచ్చి... బంద్‌లో పాల్గొనాలని తెరాస ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.
'రైతు వ్యతిరేక చట్టాలను తక్షణమే రద్దు చేయాలి' - భారత్ బంద్ తాజా వార్తలు
ఖమ్మం జిల్లాలో బైక్ ర్యాలీ చేపట్టారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతు సంక్షేమానికి తెరాస పెద్ద పీట వేస్తోందని తెలిపారు.
'రైతు వ్యతిరేక చట్టాలను తక్షణమే రద్దు చేయాలి'
రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ దేనికైనా సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. పట్టణ వీధుల్లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు.
ఇదీ చదవండి:దిల్లీ సీఎం కేజ్రీవాల్ గృహ నిర్బంధం!