తన భర్త చనిపోవడంతో ఆస్తి కాజేయడానికి సొంత అన్నదమ్ముళ్లు హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నారని.. రక్షణ కల్పించాలని ఓ మహిళ... మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించింది. ఖమ్మం జిల్లా బాలపేట గ్రామానికి చెందిన బాధిత మహిళ సరస్వతి భర్త ఇటీవల మరణించాడు. కోట్లు విలువచేసే ఆస్తి రాసివ్వాలని అన్నదమ్ములైన వల్లభనేని శ్రీను, వెంకటేశ్వరరావు కిడ్నాప్ చేసి విచక్షణారహితంగా కొట్టారని ఆవేదన వ్యక్తం చేసింది. అక్కడ నుంచి తప్పించుకొని ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొంది. సీఐ సాయిరాం వారితో కుమ్మకై అరెస్టు చేయకుండా కేసును పక్కదోవ పట్టించారని తెలిపింది. చంపడానికి ప్రయత్నిస్తున్న తన అన్నదమ్ములతో పాటు, సీఐపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధిత మహిళ మానవ హక్కుల కమిషన్ను వేడుకొంది.
'ఆస్తి కోసం సోదరులే హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నారు' - hrc
ఆస్తి కోసం సొంత సోదరులే హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. రక్షణ కల్పించాలని మానవహక్కుల కమిషన్ను ఆశ్రయించింది.
hrc