తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమంలో ఖమ్మం జిల్లా తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో మహానాడు కార్యక్రమం ప్రారంభించిన నాయకులు జూమ్ యాప్ ద్వారా అధినేత చంద్రబాబు నాయుడు ప్రసంగాన్ని విన్నారు.
జూమ్ యాప్లో తెదేపా మహానాడు - khammam district news
ఖమ్మం జిల్లా తెదేపా కార్యాలయంలో జూమ్ యాప్ ద్వారా నాయకులు మహానాడు కార్యక్రమంలో పాల్గొన్నారు. తెదేపా అధినేత చంద్రబాబు ప్రసంగాన్ని యాప్ ద్వారా విన్నారు.

జూమ్ యాప్లో తెదేపా మహానాడు
పార్టీ కార్యాలయంలో భౌతిక దూరం పాటిస్తూ తమ చరవాణిలో అధినేత, ఇతర నాయకుల ప్రసంగాలను ఆలకించారు. అంతకు ముందు జిల్లా కార్యాలయంలో పార్టీ జెండాను ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ ఇంఛార్జి కూరపాటి వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు. అనంతరంన పార్టీ వ్యవస్థాపకులైన ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు.
ఇవీ చూడండి: డిజిటల్ మహానాడు-2020పై బాబు ట్వీట్