ఖమ్మంలో జిల్లాలో లాక్డౌన్ పటిష్టంగా అమలు అవుతున్నప్పటికీ కరోనా నిర్ధారణ పరీక్షల కోసం వచ్చే వారితో రోడ్లు కొంతమేర రద్దీగా మారుతున్నాయి. నగరంలో నిర్ధారణ పరీక్షలకు వస్తున్న వారిని దృష్టిలో ఉంచుకొని మొత్తం మూడు కేంద్రాల్లో పరీక్షలు చేస్తున్నారు.
కరోనా పరీక్ష, వ్యాక్సిన్ కోసం వచ్చే వారికే అనుమతి - ఖమ్మంలో 10 దాటితే అంతే
ఖమ్మం జిల్లాలో లాక్డౌన్ కఠినంగా అమలవుతోంది. కరోనా పరీక్షలు, వ్యాక్సిన్ తీసుకునే వారిని తప్ప 10 గంటల తర్వాత రోడ్లపై పోలీసులు ఎవరినీ అనుమతించడం లేదు.
ఖమ్మంలో కఠినంగా లాక్డౌన్ అమలు
మాస్కు ధరించి, సామాజిక దూరం పాటిస్తూ పరీక్షలు చేయించుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చే వారిని పోలీసులు మందలించి పంపిస్తున్నారు. ఇంట్లోనే ఉంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోమని చెబుతున్నారు.