ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు ఖమ్మం రీజినల్ మేనేజర్ సాల్మన్ పేర్కొన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు సంస్థ ఎండీ ఆదేశాల మేరకు పంచ సూత్రాలు పాటించేలా సూచనలు అందిస్తున్నామని తెలిపారు.
'ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడమే మా లక్ష్యం' - ఆర్టీసీ ఉద్యోగులకు పంచ సూత్రాలు
ఆర్టీసీ ఎండీ ఆదేశాల మేరకు... ఉద్యోగులు పంచ సూత్రాలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఖమ్మం రీజినల్ మేనేజర్ సాల్మన్ పేర్కొన్నారు. ప్రస్తుతం లక్ష్యం మేరకు ఆదాయం వస్తుందని పేర్కొన్నారు.
'ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడమే మా లక్ష్యం'
ప్రయాణికులతో మర్యాదగా మాట్లాడటం, కోరిన చోట బస్సు ఆపటం వంటివి కచ్చితంగా అమలయ్యేలా చూడాలని ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం లక్ష్యం మేరకు ఆదాయం వస్తున్నట్లు తెలిపారు. పని దినాలు లేని సమయంలో మాత్రం... కొంతమేరకు తగ్గుతుందన్నారు. ప్రతి డిపో నుంచి కొంత మేరకు ఆదాయం పెంచగలిగితే లక్ష్యం పూర్తిస్థాయిలో సమకూరుతుందని వెల్లడించారు.
ఇదీ చూడండి:అట్టహాసంగా లింగమంతుల జాతర ప్రారంభం.. బారులుతీరిన భక్తులు