తెలంగాణ

telangana

ETV Bharat / state

Fake Seeds: ఖమ్మంలో నకిలీ విత్తన దందాపై పోలీసుల ఉక్కుపాదం - నకిలీ విత్తనాలతో రైతులకు నష్టాలు

ఖమ్మం జిల్లాలో నకిలీ విత్తన దందాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అనుమతిలేని కంపెనీల విత్తనాలను రైతులకు అంటగట్టే వ్యాపారులను పట్టుకుని కటకటాల వెనకకు పంపుతున్నారు. భారీ మొత్తంలో నకిలీ విత్తనాలు స్వాధీనం చేసుకుంటున్నారు.

khammam police taking actions on fake seed business
ఖమ్మంలో నకిలీ విత్తన దందాపై పోలీసుల ఉక్కుపాదం

By

Published : Jun 12, 2021, 6:55 PM IST

ఖమ్మం జిల్లావ్యాప్తంగా ఇంత వరకు రూ.2 కోట్ల విలువైన నకిలీ విత్తనాలను పట్టుకున్నట్లు సీపీ విష్ణు వారియర్‌ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 44 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. ఎన్కూరు, రఘునాథపాలెం, బోనకల్లు, ఖమ్మం గ్రామీణ మండలం, ఖమ్మం మూడవ పట్టణ ఠాణా పరిధిలో నకిలీ విత్తనాలు పట్టుకున్నట్లు సీపీ తెలిపారు.

జిల్లాలో ఎట్టి పరిస్థితుల్లో నిషేధిత, కల్తీ, నకిలీ విత్తనాలు రైతులకు చేరకుండా చర్యలు తీసుకుంటున్నామని విష్ణు వారియర్‌ వివరించారు. రాష్ట్ర సరిహద్దు మండలాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి:Etala: 'హుజూరాబాద్‌లో కౌరవులు, పాండవులకు మధ్య యుద్ధం'

ABOUT THE AUTHOR

...view details