తెలంగాణ

telangana

ETV Bharat / state

సొంతూరు వెళ్తున్న కూలీలు... అడ్డుకున్న పోలీసులు - khammam police stop the migrant labours

లాక్‌డౌన్‌తో ఉపాధి లేక వలస కూలీలు సొంత గ్రామాలకు వెళ్తున్నారు. స్థానికుడు ఇచ్చిన సమాచారంతో పోలీసుసు వారిని ఖమ్మం వద్ద అడ్డుకుని స్థానికంగా ఓ ఫంక్షన్ హాల్‌కు తరలించారు.

khammam-police-stop-the-migrant-labours-at-khammam-district
సొంతూరు వెళ్తున్న కూలీలు... అడ్డుకున్న పోలీసులు

By

Published : Apr 26, 2020, 1:44 PM IST

రాష్ట్రంలో అత్యధికంగా వలస కూలీలు ఉన్న జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఉపాధిలేక వలస కూలీలు తమ సొంత గ్రామాలకు నడక మార్గాన తరలి వెళ్తున్నారు. రోడ్డు మార్గాన నడిస్తే పోలీసులు పట్టుకుంటున్నారని మహారాష్ట్రకు చెందిన కూలీలు నాగార్జున సాగర్ కాల్వ గట్టుపై ఎనిమిది రోజులుగా నడుస్తూ.... ఖమ్మంకు చేరుకున్నారు.

అన్నం సేవ సంస్థకు చెందిన శ్రీనివాసరావు ఖమ్మం వద్ద వారిని అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని స్థానికంగా ఉన్న ఫంక్షన్ హాల్‌కు తరలించారు.

ఎనిమిది రోజులుగా నడుస్తున్నాం... చిన్నపిల్లలు ఆకలితో ఏడుస్తూరు, తమ గ్రామాలకు తరలించాలని కూలీలు పోలీసులను వేడుకుంటున్నారు.

ఇదీ చూడండి:తడిసిన ధాన్యం రాశులు... తల్లడిల్లిన అన్నదాతలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details