తెలంగాణ

telangana

ETV Bharat / state

ఖమ్మంలో కుక్కల బెడద.. పరిష్కారానికి బల్దియా చర్యలు - street dogs in khammam

వీధి మూలమలుపు వద్ద తిరగాలంటే భయం.. రాత్రిళ్లు ఇంటికి వెళ్లాలంటే భయం.. ఏ మూల నుంచి కుక్కలు వచ్చి దాడి చేస్తాయోనని భయం. విపరీతంగా పెరిగిన కుక్కల సంఖ్యతో ఖమ్మం నగర ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. చిన్నపిల్లలను ఒంటరిగా బయటకు పంపేందుకు భయపడాల్సిన పరిస్థితి. అటువంటి పరిస్థితుల నుంచి స్థానికులను రక్షించేందుకు నగర పాలక సంస్థ నడుం బిగించింది. శునకాల సంఖ్యను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటోంది. వీధికుక్కల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి.. వాటికి నియంత్రణ శస్త్రచికిత్సలు చేస్తోంది. నగర పాలక సంస్థ పటిష్ఠ చర్యలపై ఈటీవీ భారత్​ కథనం.

dogs prevention, khammam municipal corporation
ఖమ్మం బల్దియా, వీధి కుక్కల నివారణ

By

Published : Mar 28, 2021, 5:02 PM IST

ఖమ్మం నగరంలో రోజురోజుకీ వీధి కుక్కల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. వాటి దాడిలో అనేక మంది గాయపడుతున్నారు. కొన్ని వీధుల్లో తిరగటానికి సైతం ప్రజలు భయపడాల్సిన పరిస్థితి. దీంతో కుక్కల సమస్యను పరిష్కరించేందుకు నగర పాలక సంస్థ చర్యలకు పూనుకుంది. ఈమేరకు రోటరీనగర్‌లో జంతు సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఆ కేంద్రంలో ప్రత్యేకంగా వీధి కుక్కల నియంత్రణకు ఆపరేషన్లు చేయాలని నిర్ణయించింది. అందుకు హైదరాబాద్‌కు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. వారు పదిమంది సుమారు 6నెలల పాటు ఈ కేంద్రంలో ఉండి కుక్కల నియంత్రణపై పని చేస్తారు.

నగరంలో జంతు సంరక్షణ కేంద్రం
కేంద్రంలో వీధి కుక్కల సంరక్షణ చర్యలు

నియంత్రణ ఆపరేషన్​..

ముందుగా కుక్కల బెడద ఎక్కువగా ఉన్న ప్రాంతం నుంచి వాటిని తీసుకువచ్చి రేబీస్‌ ఇంజిక్షన్‌, పిల్లలు పుట్టకుండా వైద్యులు ఆపరేషన్​ చేస్తారు. 3 రోజులు సంరక్షణ కేంద్రంలో ఉంచుకుని తిరిగి వాటిని ఎక్కడి నుంచి తెచ్చారో అక్కడే వదిలి పెడతారు. నగరంలో విపరీతంగా పెరిగిపోతున్న శునకాల దాడుల నుంచి రక్షించేందుకు నగరపాలక సంస్థ తీసుకుంటున్న చర్యల పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

శునకాలకు నియంత్రణ ఆపరేషన్​ చేస్తున్న వైద్యులు

ఇదీ చదవండి:కేసీఆర్ కనుసన్నల్లో కాంగ్రెస్: ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్

ABOUT THE AUTHOR

...view details