తెలంగాణ

telangana

ETV Bharat / state

కిర్గిస్థాన్​లోని భారతీయ విద్యార్థులను స్వదేశానికి తీసుకురండి: నామ

కిర్గిస్థాన్​లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులను స్వదేశానికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేయాలని కోరుతూ కేంద్ర మంత్రికి ఖమ్మం ఎంపీ, తెరాస లోక్​సభాపక్ష నేత నామ నాగేశ్వరరావు లేఖ రాశారు. పరాయి దేశంలో భారతీయ విద్యార్థులు పడుతున్న కష్టాలను లేఖలో వివరించారు.

khammam-mp-nama-nageswarao-letter-to-union-minister-for-making-arrangements-to-bring-students-stranded-in-kirgistan
కిర్గిస్థాన్​లోని భారతీయ విద్యార్థులను స్వదేశానికి తీసుకురండి: నామ

By

Published : Jul 13, 2020, 9:43 PM IST

కరోనా ప్రభావం వల్ల కిర్గిస్థాన్​లో ఇరుక్కుపోయిన భారతీయ వైద్య విద్యార్థులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కృషిచేయాలని కేంద్ర మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్​కు.. ఎంపీ నామ నాగేశ్వరరావు లేఖ రాశారు. వైద్య విద్యను అభ్యశించడానకి వెళ్లిన తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు అక్కడ ఏజెంట్ల చేతిలో మోసపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు.

తెలంగాణకు చెందిన 170 మంది, ఏపీకి చెందిన 65 మంది మొత్తం 235 విద్యార్థులు పరాయి దేశంలో అవస్థలు పడుతున్నారని తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో వారి గోడును వెలిబుచ్చుకుంటున్నారని చెప్పారు. త్వరగా వారిని స్వదేశానికి రప్పించాలని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్​ను లేఖలో కోరారు.

ఇదీ చూడండి:' కార్పొరేటర్​ నుంచి ప్రాణహాని ఉంది.. రక్షణ కల్పించండి'

ABOUT THE AUTHOR

...view details