తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనాను సీరియస్​గా తీసుకోండి: ఎంపీ నామ

లోక్ సభ ఎన్ఐసీ వెబ్ఎక్స్ ద్వారా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో తెరాస లోక్ సభ పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు పాల్గొన్నారు. స్పీకర్ ఓం బిర్లా ఆధ్వర్యంలో కేంద్ర ఆరోగ్య, సంక్షేమశాఖ మంత్రి హర్షవర్ధన్ సంబంధిత వైద్యులు వివిధ పార్టీల ఎంపీలు పాల్గొన్నారు.

కరోనాను సీరియస్ గా తీసుకోండి: ఎంపీ నామా
కరోనాను సీరియస్ గా తీసుకోండి: ఎంపీ నామా

By

Published : Jul 28, 2020, 6:06 PM IST

ప్రజలు కరోనాను సీరియస్ గా తీసుకోవాలని ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు అన్నారు. హెపటైటిస్ బి ఇన్ ఫెక్షన్ వ్యాప్తి అరికట్టడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కరోనా కాలంలో కాలేయాన్ని జాగ్రత్తగా చూసుకోవడంపై లోక్ సభ ఎన్ఐసీ వెబ్ఎక్స్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్పీకర్ ఓం బిర్లా ఆధ్వర్యంలో కేంద్ర ఆరోగ్య, సంక్షేమశాఖ మంత్రి హర్షవర్ధన్ సంబంధిత వైద్యులు వివిధ పార్టీల ఎంపీలు పాల్గొన్నారు. ఈ కాన్ఫరెన్స్ కు తెరాస లోక్ సభ పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు హాజరయ్యారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొందరు కరోనా బారిన పడి మరణించడం బాధాకరమని ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరికి వారు స్వీయనియంత్రణ పాటించాలని ఆయన కోరారు. లక్షణాలు ఉంటే పరీక్షలు చేయించుకోవాలని.. అశ్రద్ధ వహించకూడదని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details