తెలంగాణ

telangana

ETV Bharat / state

కేసీఆర్ వంటి నేత దొరకడం ప్రజల అదృష్టం: నామ - షాదీముబారక్

ఆడపిల్లల పెళ్లిళ్లు తల్లిదండ్రులకు భారం కాకూడదనే లక్ష్యంతోనే.. సీఎం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్​ పథకాలను ప్రవేశపెట్టారని ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు అన్నారు. కల్లూరు మండలంలోని లబ్ధిదారులకు ఆయన చెక్కులను పంపిణీ చేశారు.

khammam mp nama nageshwar distributed kalyana lakshmi checks in kalloor
కేసీఆర్ లాంటి సీఎం దొరకడం అదృష్టం: ఎంపీ నామా

By

Published : Jan 5, 2021, 11:38 AM IST

సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టి నిరుపేదల కుటుంబాల్లో సంతోషాలు నింపారని ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యతో కలసి ఆయన కల్లూరు మండలంలోని లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.

ఎమ్మెల్యే సండ్ర కృషితో సత్తుపల్లి నియోజకవర్గంలోని అర్హులందరూ పలు సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారని నామ పేర్కొన్నారు. కొవిడ్ నేపథ్యంలో రాష్ట్రం ఆర్థిక నష్టాల్లో ఉన్నా.. అభివృద్ధి కార్యక్రమాలను మాత్రం ఆపలేదని గుర్తు చేశారు. కేసీఆర్ లాంటి సీఎం దొరకడం తమ అదృష్టమంటూ కొనియాడారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సూర్యనారాయణ, ఏసీపీ వెంకటేష్ , తహసీల్దార్ మంగీలాల్, ఎంపీపీ రఘు, ఎంపీడీవో నవాబ్, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:కల్యాణలక్ష్మి పథకం అక్రమాల్లో వెలుగుచూస్తున్న కొత్తకోణం

ABOUT THE AUTHOR

...view details