కరోనా మహమ్మారి విస్తరిస్తున్న వేళ ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. కొవిడ్ బారిన పడినవారు, ఇంట్లో ఉండి చికిత్స తీసుకుంటున్నవారికి వంట చేసుకోవడం కష్టంగా ఉంటోంది. ఇంట్లో కుటుంబసభ్యులు అందరూ కరోనా బారిన పడితే బయటకు వెళ్లి కూరగాయలు, నిత్యావసరాలు తెచ్చుకోవటం సమస్యగా మారింది. ఇలాంటి ఆపదలో ఉన్న వారికి ఖమ్మంలోని కన్యకాపరమేశ్వరీ అమ్మవారి ఆలయ కమిటీ అండగా నిలుస్తోంది.
Corona: కరోనా బాధితులకు అండగా కన్యకాపరమేశ్వరీ ఆలయ కమిటీ - kanyaka parameswari temple helping corona victims
కరోనా బారిన పడి ఇబ్బందులు పడుతున్న వారికి ఖమ్మంలోని కన్యకాపరమేశ్వరీ ఆలయ కమిటీ అండగా నిలుస్తోంది. భోజనం తయారు చేసుకోవడం కష్టంగా ఉన్నవారు.. ఆలయ కమిటీకి చరవాణి ద్వారా సమాచారం అందిస్తే.. వారి ఇంటి వద్దకే భోజనం పంపిస్తున్నారు. రోజుకు 100 మందికి భోజనం అందిస్తున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది.
ఖమ్మం వార్తలు, ఖమ్మంలో కన్యకాపరమేశ్వరి ఆలయ కమిటీ
భోజనం చేసుకోవడం కష్టంగా ఉన్నవారు చరవాణి ద్వారా ఆలయ కమిటీని సంప్రదిస్తే ఇంటి వద్దకే వెళ్లి భోజనం అందజేస్తున్నారు. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం పంపిణీ చేస్తున్నారు. రోజుకు దాదాపు 100 మంది బాధితులకు ఖమ్మం నగరమంతా తిరిగి భోజనాలు అందిస్తున్నట్లు కమిటీ అధ్యక్షుడు తెలిపారు. దీనికోసం రోజుకు 10వేల రూపాయలు ఖర్చు అవుతుందని, మొత్తం ఆలయ కమిటీ భరిస్తుందని చెప్పారు.