తెలంగాణ

telangana

ETV Bharat / state

విక్రయించేందుకు వస్తే ఇన్ని సమస్యలు సృష్టిస్తారా..? - ఖమ్మం రైతులు

" ధాన్యం సేకరణ కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి... అన్ని వసతులు కల్పించాం"... అని అధికారులు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. ధాన్యం తరలింపునకు సరైన వసతులు లేక కొనుగోలుకు రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. మరోసారి తుఫాను హెచ్చరికలు రావడం వల్ల ఏ క్షణాన వర్షం కురుస్తుందోనని అన్నదాతల్లో వణుకు పుడుతోంది.

ఇన్ని సమస్యలు సృష్టిస్తారా..?

By

Published : Apr 26, 2019, 4:13 PM IST

ఖమ్మం జిల్లా మధిర మార్కెట్​ యార్డులో సహకార సంఘం ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఈ నెల 10న ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు 12,000 బస్తాల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. రైతులు తెచ్చిన మరో పదివేల బస్తాల ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా రోజుల తరబడి నిరీక్షించేలా ఇబ్బందులు పెడుతున్నారు.

తుఫాన్​ హెచ్చరికతో అన్నదాతల ఆందోళన

రెండు రోజుల కిందట కురిసిన అకాల వర్షానికి కేంద్రంలోని ధాన్యం తడిచిపోయింది. ఆరబెట్టి తీసుకువచ్చిన తర్వాత కూడా కొనుగోలు చేయకుండా జాప్యం చేస్తున్నారు. మరోమారు తుఫాన్ హెచ్చరికలు జారీ కావడం వల్ల ఏ క్షణాన వర్షం కురుస్తుందోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఒక్క లారీయే...

నగర కేంద్రంలో రోజూ మూడు లారీల ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. తరలించేందుకు మాత్రం రెండు రోజులకు ఒక లారీ అందుబాటులో ఉంటోంది. కేంద్రంలో ధాన్యం నిల్వలు పేరుకుపోయి రైతులు రోజుల తరబడి పడిగాపులు పడాల్సిన దుస్థితి నెలకొంది.

ఇలా చేస్తారా..?

ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం ఏ గ్రేడ్ ధాన్యం రకం రూ 1,770, సాధారణ రకం రూ.1,750కు కొనుగోలు చేస్తున్నారు. తరుగు పేరుతో కిలోల నష్టాన్ని కలిగిస్తున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు. బయట తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని ఇక్కడికి తీసుకువస్తే ఇన్ని సమస్యలు సృష్టిస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇలా చేస్తారా

ఇదీ చూడండి : జన బలం, ఐక్యతా మంత్రంతో కాశీ బరిలోకి...

ABOUT THE AUTHOR

...view details