కలకాలం తోడుండాల్సిన వాడు పట్టించుకోలేదు.. అమ్మలా చూసుకోవాల్సిన అత్త.. ఇంటి నుంచి వెళ్లగొట్టింది. ఓ పక్క అనారోగ్యం.. మరోవైపు రోడ్డు ప్రమాదంలో విరిగిన కాలుతోనే చెట్టుకిందకు చేరింది. ఆమె దుస్థితిని చూసిన గ్రామస్థులే ఆకలి తీర్చారు. ఆమె దీన స్థితిని ఈనాడు వెలుగులోకి తీసుకువచ్చింది. స్పందించిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆపన్నహస్తం అందించారు. అభాగ్యురాలికి అండగా నిలిచారు. ఆస్పత్రిలో చేర్పించి మెరుగైన చికిత్స అందేలా చూశారు.
చెట్టునీడే ఆవాసం..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం భగత్‌సింగ్ నగర్లో గుర్రం మహేశ్- మౌనిక దంపతులు నివసిస్తున్నారు. ఆరు నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో మౌనిక కాలు విరిగింది. వరంగల్ ఎంజీఎంలో శస్త్రచికిత్స చేయించి కాలుకి ఇనుప రాడ్లు అమర్చారు. ఆమె పరిస్థితి కాస్త మెరుగయ్యాక ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. ఇంటికి వచ్చాక మౌనికను.. ఆమె భర్త, అత్త సరిగా పట్టించుకోవడం మానేశారు. కొన్నాళ్లకు ఇంటి నుంచి వెళ్లగొట్టారు. అయినవాళ్లు పట్టించుకోక.. ఆరోగ్యం సహకరించక.. ఆ అభాగ్యురాలు నానా అవస్థలు పడింది. చివరికి దిక్కుతోచని స్థితిలో విరిగిన కాలుతోనే.. పొట్టకూటికోసం బిక్షం ఎత్తుకోవడం మొదలెట్టింది. ఆమె దీనస్థితిని చూసిన గ్రామస్థులు భోజనం పెట్టేవారు.
ఆదుకున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి..