తెలంగాణ

telangana

ETV Bharat / state

కొనుగోళ్లలో జాప్యం.. రైతన్నల శోకం.. - కొనుగోళ్లలో జాప్యం

కొనుగోలు కేంద్రాల నిర్వహణలో జాప్యం కారణంగా అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. ఖమ్మం జిల్లాలో ధాన్యం,మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశినా తేమశాతం పేరుతో కొనుగోళ్లలో జాప్యం జరుగుతోందని నిరాశ చెందుతున్నారు. వీటికి తోడు అకాల వర్షాలు తమకు తీరని ఆవేదనను కలిగిస్తున్నయంటున్నారు.

khammam farmers Difficulties in grain purchasing centers due to lock down and sudden rains
కొనుగోళ్లలో జాప్యం.. రైతన్నల శోకం..

By

Published : Apr 9, 2020, 4:40 PM IST

ఖమ్మం జిల్లాలో 432 ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించినా గ్రామాల్లో ఎగుమతులు, కాంటాలు పూర్తిస్థాయిలో లేకపోవడం వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. కేంద్రాల వారీగా బస్తాలు దిగుమతి చేసుకున్నా.. కేంద్రాల నిర్వహణలో జాప్యం జరుగుతుందని కర్షకులు ఆరోపిస్తున్నారు. తేమశాతం పరిశీలించి కూపన్లు ఇస్తామని చెబుతున్నా చాలా గ్రామాల్లో అమలుకావడం లేదని ఆరోపిస్తున్నారు. తేమశాతంలో చాలా వరకు జాప్యం జరుగుతున్నాయని.. కాగా అకాల వర్షాల ధాటికి రోజూ కుప్పలను ఆరబోసుకోవడం కుప్పచేసుకోవడం జరుగుతుందని వాపోతున్నారు.

వైరా- మధిర రహదారిలో కిలోమీటర్ల మేర ధాన్యం ఆరబోసి దర్శనమిస్తున్నాయి. మొక్కొజొన్న రాశులతో ఇళ్ల ముందు కూపన్ల కోసం ఎదురుచూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు కాంటాలు ఎగుమతి చేయాలని కోరుతున్నారు. వైరా మండలం పూసలపాడు, గరికపాడు, వైరా సహకార సంఘాల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యం లారీలకు ఎగుమతి చేసినా రవాణా సరిగా లేదని, మిల్లుల వద్ద దిగుమతులు కావడం లేదని.. హమాలీలు లేరంటూ జాప్యం చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.

కొనుగోళ్లలో జాప్యం.. రైతన్నల శోకం..

"కూలీల, ట్రాక్టర్ల రేట్లు పెరిగాయి.. ప్రభుత్వ కాస్త సబ్సిడీ ఇచ్చి తమను ఆదుకోవాలి.

నిన్న మొన్నా వచ్చిన అకాల వర్షాల కారణంగా బస్తాలు లేక పట్టాలు వాని వాటిని కాపాడుకోవడానికి నానా అవస్థలు పడ్డాం- రైతు"

రైతుల దిగుబడులను కొనుగోలు చేయడానికి కేంద్రాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం రవాణా, దిగుమతులు, బస్తాల కొరత, హమాలీల కొరత లేకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. కరోనా నేపథ్యంలో వరికోత యంత్రాలు, కూలీల ఖర్చు ఎక్కువయిందని దానికి అనుగుణంగా రైతులకు ప్రభుత్వం గిట్టుబాటు కల్పించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

ఇవీచూడండి:కోయలేక.. కోసినా అమ్మలేక.. చ'మిర్చి'న రైతు కళ్లు!

ABOUT THE AUTHOR

...view details