లంచాలలో ఈ తీరే వేరయా... ఆ అధికారి ఇలా బుక్కయ్యాడు! - phone pay
లంచం తీరు మారుతోంది! ఇప్పటివరకూ డబ్బులు తీసుకుంటుంటే... రెడ్‌హ్యాండెడ్‌గా "అనిశా" దాడి చేసి పట్టుకోవడం చూశాం. కానీ కారేపల్లిలో ఎవరూ ఊహించని రీతిలో లంచం తీసుకోవడం కలకలం రేపింది. అయినప్పటికీ అనిశాకు చిక్కడంతో ఆ అధికారి గుట్టు రట్టయింది. ఇంతకీ ఆ అధికారి లంచం ఎలా తీసుకుంటున్నాడంటే...
ఫోన్ పే ద్వారా లంచం తీసుకున్న ఈవోపీఆర్డీ
ఖమ్మం జిల్లా కారెపల్లి ఎంపీడీవో కార్యాలయంలో అనిశా అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈవోపీఆర్డీ విక్రమ్ కుమార్... ఔట్సోర్సింగ్ ఉద్యోగి హరిదాస్ నాయక్ వేతనం మంజూరు చేయడానికి లంచం డిమాండ్ చేశాడు. దానికి అంగీకరించిన హరిదాస్ ఫోన్ పే యాప్ ద్వారా 14 వేల రూపాయలు ట్రాన్స్ఫర్ చేశాడు. ఈ విషయం తెలుసుకున్న అనిశా అధికారులు ఆధారాలతో సహా విక్రమ్ కుమార్‌ను పట్టుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
- ఇదీ చూడండి : అనిశా కోర్టుకు హాజరైన గాలి జనార్దన్ రెడ్డి