ఖమ్మం జిల్లాలో కరోనా వైరస్ ప్రభావంపై ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని జిల్లా వైద్యాధికారి డా.మాలితి తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో ఎటువంటి కేసులు నమోదు కాలేదని స్పష్టం చేశారు. ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప బహిరంగ ప్రదేశాలకు వెళ్లొద్దన్నారు. ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రత్యేక వార్డును ఏర్పాటుచేసినట్లు తెలిపారు. కరోనాపై అవగాహనకు కరపత్రాలను విడుదల చేశారు.
కరోనా కోసం ప్రత్యేక వార్డు: డీఎంహెచ్వో - ఖమ్మంలో కరోనా ఐసోలేషన్ వార్డులు
ఇప్పటి వరకు ఖమ్మం జిల్లాలో కరోనా కేసులు నమోదుకాలేదని జిల్లా వైద్యాధికారి డా. మాలతి తెలిపారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
కరోనా కోసం ప్రత్యేక వార్డు: డీఎంహెచ్వో