ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రేజర్లలో పన్నెండు లక్షల రూపాయలతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనుల శిలాఫలకాన్ని సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య ఆవిష్కరించారు. సింగరేణి ప్రభావిత ప్రాంతమైన రేజర్ల గ్రామాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని సండ్ర వెంకటవీరయ్య తెలిపారు. గ్రామంలో సింగరేణి ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
రేజర్ల గ్రామంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన - సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య
ముఖ్యమంత్రి కేసీఆర్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేందుకు ఏర్పాటు చేసిన పట్టణ, గ్రామ ప్రగతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సూచించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రేజర్లలో అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
![రేజర్ల గ్రామంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన Sathuppalli Legislators Sandra Venkataveeraiah](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7525829-757-7525829-1591618544186.jpg)
రేజర్ల గ్రామంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ముఖ్యమంత్రి కేసీఆర్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ఏర్పాటు చేసిన పట్టణ, గ్రామ ప్రగతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రజలకు సూచించారు. విపత్కర పరిస్థితుల్లో కూడా పారిశుద్ధ్య కార్యక్రమాలకు అవసరమైన నిధులు విడుదల చేయడం అభినందనీయమని పేర్కొన్నారు.
ఇదీ చూడండి:తీవ్ర ఉత్కంఠ.. ముఖ్యమంత్రి నిర్ణయం కోసం ఎదురుచూపు