లాక్‌డౌన్ నేపథ్యంలో.. వృద్ధులు, వికలాంగులకు దాతలు అండగా నిలిచారు. ఖమ్మం జిల్లాలో తల్లాడ గ్రామంలో ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో.. నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 60 మంది వికలాంగులకు సరకులు అందజేశారు.
భౌతిక దూరంతోనే.. కరోనా వైరస్ నిర్మూలన సాధ్యం - ఖమ్మం జిల్లా తల్లాడలో నిత్యావసరాల పంపిణీ
కరోనా వైరస్ నిర్మూలనకు ప్రజలు తప్పనిసరిగా భౌతిక దూరం పాటించి.. మస్క్ ధరించాలని ఎస్సై తిరుపతి రెడ్డి కోరారు. ఖమ్మం జిల్లా తల్లాడ గ్రామంలో ప్రెస్‌క్లబ్ నిర్వాహకులు.. నిత్యావసరాలు, బియ్యం పంపిణీ చేశారు.
![భౌతిక దూరంతోనే.. కరోనా వైరస్ నిర్మూలన సాధ్యం Khammam district Press Club supply of essentials and rice.](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7323445-281-7323445-1590299008512.jpg)
భౌతిక దూరంతోనే.. కరోనా వైరస్ నిర్మూలన సాధ్యం
విపత్కర సమయంలో పేదలకు మానవతా దృక్పథంతో పంపిణీ చేయడం పట్ల ఎస్సై తిరుపతిరెడ్డి నిర్వాహకులను అభినందించారు. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని సూచించారు. కరోనా వైరస్ నిర్మూలనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న నియమాలను తప్పనిసరిగా పాటించాలని ప్రజలను కోరారు.
TAGGED:
KHAMAM Lock Down News