ఖమ్మం జిల్లా కార్మికశాఖ అధికారి ఆనంద్‌రెడ్డి హత్య - anand reddy murder
19:14 March 10
ఖమ్మం జిల్లా కార్మికశాఖ అధికారి ఆనంద్‌రెడ్డి హత్య
ఖమ్మం జిల్లా కార్మిక శాఖ అధికారి ఆనంద్‌రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గొళ్లబుద్దారం అడవిలో హత్య జరిగినట్లు పోలీసులు నిర్ధరించారు. ఆర్థిక లావాదేవీలే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది.
జనగామ జిల్లా ఓబుల్ కేశవాపూర్‌కు చెందిన ఆనంద్ రెడ్డి... ఖమ్మం సహాయ కార్మిక శాఖ అధికారిగా పనిచేస్తున్నారు. స్థానికంగా ఉన్న ఇసుక వ్యాపారి ప్రదీప్ రెడ్డితో... ఆర్థిక లావాదేవీలున్నట్లు సమాచారం. ఈ నెల 7న ప్రదీప్‌రెడ్డితో కలిసి వెళ్లిన ఆనంద్ రెడ్డి ఇంటికి తిరిగిరాలేదు. పోలీసులకు ఫిర్యాదు చేసిన కుటుంబ సభ్యులు ప్రదీప్‌రెడ్డిపై అనుమానం వ్యక్తం చేశారు. విచారణలో ఆనంద్ రెడ్డి హత్యకు గురైనట్లు తేలింది. ప్రస్తుతం పోలీసులు హత్య జరిగిన ప్రాంతానికి వెళ్లారు.