తెలంగాణ

telangana

ETV Bharat / state

స్వీయ నిర్బంధం పాటించాలంటూ గ్రామంలో సర్పంచ్​ ప్రచారం - ఖమ్మంలో కొవిడ్​ కేసుల వివరాలు

గ్రామాల్లో కొవిడ్​ ఉగ్రరూపం దాల్చుతోంది. రోజు రోజుకు పాజిటివ్​ కేసులు భారీగా వస్తున్నాయి. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం సింగరేణి పంచాయతీలో సర్పంచ్​... మైక్​తో వీధుల్లో ప్రచారం చేస్తూ అవగాహన కల్పిస్తున్నారు.

అవగాహన కల్పిస్తున్న సర్పంచ్​
Telangana

By

Published : Apr 26, 2021, 7:56 AM IST

ఒకప్పుడు గెలుపు కోసం వీధుల్లో తిరుగుతూ ఓటు అభ్యర్థించిన ఆమె. ఇప్పుడు ఎవ్వరూ బయటకు రావొద్దని వీధుల్లో ప్రచారం చేస్తున్నారు. సాధ్యమైనంతవరకు ఇంట్లోనే ఉండండి. అత్యవసరమైతేనే అన్ని జాగ్రత్తలు తీసుకుని బయటకు రండి అంటూ వీధుల్లో మైక్​తో అనౌన్స్​మెంట్​ చేస్తున్నారు.

ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం సింగరేణి పంచాయతీలో కొవిడ్​కేసులు భారీగా వస్తున్నాయి. ఇప్పటికే పలు వీధులు కంటైన్​మెంట్​ జోన్​లుగా ప్రకటించారు. కొవిడ్​ ఉగ్రరూపం దాల్చుతున్నందున ప్రజలెవ్వరూ బయటకు రావొద్దంటూ గ్రామ సర్పంచ్..​ వీధుల్లో తిరుగుతూ అవగాహన కల్పిస్తున్నారు.

ఇదీ చూడండి:జడలు చాస్తున్న మహమ్మారి... పదిరోజుల్లోనే రెట్టింపు కేసులు

ABOUT THE AUTHOR

...view details