తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రంలోనే ఖమ్మం జిల్లా ప్రథమ స్థానం - ఖమ్మం జిల్లా తాజా వార్తలు

రుణాల మంజూరు విషయంలో రాష్ట్రంలోనే ఖమ్మం జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. జిల్లా వ్యాప్తంగా 23,813 ఎస్‌హెచ్‌జీలకుగాను రుణాన్ని పొందేందుకు 11,942 సంఘాలను ఎంపిక చేశారు.

Khammam District is the first in the telangana state
రాష్ట్రంలోనే ఖమ్మం జిల్లా ప్రథమ స్థానం

By

Published : May 12, 2020, 2:05 PM IST

లాక్‌డౌన్‌ నేపథ్యంలో స్వయం సహాయక సంఘాల సభ్యుల్లో ఆత్మస్థైర్యం నింపి ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. సభ్యులకు కొవిడ్‌-19 రుణాలను అందించాలని నిర్ణయించింది. రుణాల మంజూరు విషయంలో ఖమ్మం జిల్లా రాష్ట్రంలోనే ప్రథమస్థానంలో నిలిచినట్లు డీపీఎం ఆంజనేయులు తెలిపారు. సంఘానికి రూ.50 వేలు అందిస్తున్నారు. సంఘంలో 10 మంది సభ్యులు ఈ రుణాన్ని రూ.5 వేల చొప్పున తీసుకుంటున్నారు. ఏప్రిల్‌ 15 నుంచి పలు బ్యాంకులు ఈ రుణాలు అందిస్తున్నారు.

ఖమ్మం జిల్లాలోని 23,813 ఎస్‌హెచ్‌జీలకుగాను రుణాన్ని పొందేందుకు 11,942 సంఘాలను ఎంపిక చేశారు. వీటిలో కూడా 9 వేల సంఘాలు ఈ రుణాలు తీసుకునేందుకు ముందుకొచ్చాయి. అయితే ఇప్పటి వరకు 1,455 సంఘాలకు రుణాలు అందించారు. భద్రాద్రి జిల్లాలో 270 సంఘాలకు ఆర్థికసాయం అందించారు.

ఇదీ చూడండి :నర్సులకు వందనం..మీ సేవలకు సలాం...

ABOUT THE AUTHOR

...view details